TELUGU VERSION


సభ్యత్వం:

 • కనీసం 18సం వయసు కలిగి యుండి దరఖాస్తు చేసుకుంటే నిబంధనలమేరకు పల్లెప్రపంచం సర్వీసెస్ బిజినెస్ ప్లాన్ లో ఏజెంట్ లేదా సర్వీసు ఏజెంట్ గా నమోదవుతారు.
 • నమోదయిన వారికి ఖాతానెంబరు కేటాయించడం జరుగుతుంది.ఒకరికి ఒక ఖాతానెంబరు మాత్రమే ఉండాలి.
 • నిబంధనలలో అవసరమైనపుడు చేసే మార్పులకు కట్టుబడి ఉండాలి.
 • ఒకటికి మించి ఖాతానెంబరు ఉంటే అన్ని రద్దవుతాయి. ఏడాదిపాటు ఏ పనీ చేయకున్ననూ, నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించినా మీ  ఖాతానెంబరు రద్దవుతుంది. 
 •  ఖాతానెంబరు రద్దయినవారికి ఎటువంటి ప్రయోజనాలు వర్తించవు.

ప్రొడక్టులు-సర్వీసులు:

 • పత్రికలు, మేగజైన్లకు చందాలు చేర్పించడం, ప్రకటనలు సేకరించడం. (ఎంపిక చేసినవారికి మాత్రమే అవకాశం)
 • శిక్షణా తరగతులు (మనో, వైజ్ఞానిక, తాత్త్విక, ప్రకృతి జీవన విధానం వంటి అంశాలపై క్లాసులు)
 • మొక్కలు (నర్సరీల ద్వారా ఇండ్లలో మొక్కలు, పల్లెప్రపంచం గార్డెన్స్ ద్వారా పొలాలలో తోటల పెంపకం)
 • సేంద్రీయ వ్యవసాయ ఉత్పత్తులు (రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడని సహజ వ్యవసాయ ఉత్పత్తులు)
 • పుస్తకములు (మంచి సాహిత్యం అమ్మకం ద్వారా ఇంటింటా గ్రంధాలయాలు ఏర్పాటు చేయడం)
 • నిత్యావసర వస్తువులు (వివిధ కంపెనీలకు చెందిన అన్ని రకాల నిత్యావసర వస్తువులను మార్కెటింగ్ చేయడం)

అవకాశం-ప్రయోజనములు :

 • ఏజెంట్  లు అమ్మకం/ కొనుగోలు,  కొత్త  ఏజెంట్ లను పరిచయం చేయడం,  ప్రొడక్టు డెలివరీ చేయడం లలో అన్నీ లేదా నచ్చిన పనిని నచ్చిన సమయంలలో మాత్రమే చేయాలనుకుంటే అదేవిధంగా చేయవచ్చు.  

 • నిబంధనలమేరకు సర్వీసు ఏజెంటుగా పనిచేయవచ్చు. నియమిత ప్రాంతంలో పత్రికలు, మేగజైన్లకు చందాలు చేర్పించడం, ప్రకటనలు సేకరించడం. ఏజెంట్ లకు అన్ని రకాలుగా సర్వీసు అందించడం చేయాలి. సర్వీసు ఏజెంట్లు ప్రతి నెలా టార్గెట్ మేరకు బిజినెస్ చేయాలి.

 • ప్రతి ఏజెంట్ కి/సర్వీసు ఏజెంటుకు 6 రకాల ప్రయోజనములు పొందేందుకు అవకాశం ఉంది.     
1) సేల్స్ టర్నోవర్ బోనస్ (STB)  
2) డైరెక్ట్ టీం మ్యాచింగ్ బోనస్ (DTMB)  
3) ఇన్ఫినిటివ్ టీం మ్యాచింగ్ బోనస్ (ITMB)  
4) లాయల్టీ యూనిట్ ఇన్సెంటివ్ (LUI)  
5ప్యాకేజి యూనిట్ ఇన్సెంటివ్ (PUI)   
6) బొనాంజా (BONANZA)

బి.వి - వర్గీకరణ :

 • డిస్ట్రిబ్యూటర్ లేదా ఏజెంట్ల పనిని కొలచే కొలమానిని బి.వి (బిజినెస్ వేల్యూమ్)
 • ఆయా ప్రొడక్టులను తయారుచేసే సంస్థలు మార్కెటింగ్ కొరకు ఇచ్చే మారిజిన్ ఆధారంగా ప్రొడక్టు బి.వి నిర్ణయించబడుతుంది.
 • ప్రొడక్టుని బట్టి బి.వి ఉంటుంది తప్ప దాని రేటుని బట్టి కాదని గమనంలో ఉంచుకోవాలి.
సభ్యులకు లభించే బి.విల వర్గీకరణ:
 1. కొనుగోలు/అమ్మకం పై  50% పర్చేజ్ బి.వి (PBV)  లభిస్తుంది.
 2. ఇతరులకు మీరు ప్రొడక్టు డెలివరీ (సేల్) చేసినపుడు ప్రొడక్టు బి.విపై  5% డెలివరీ బి.వి (DBV) లభిస్తుంది.
 3. సంస్థ నుండి ప్రత్యేక సందర్భాలలో లేదా బొనాంజా బహుమతిగా లభించేది యాడింగ్ బి.వి (ABV)
సర్వీసు ఏజెంట్లకు లభించే బి.విల వర్గీకరణ (SBV):
 • సభ్యులకు సర్వీసు అందించేందుకు మూడు స్థాయిలలో సర్వీసు ఏజెంట్లను సంస్థ నియమిస్తుంది.
 • వీరిని ప్రమోటర్లు, కో-ఆర్డినేటర్లు, ఆర్గనైజర్లుగా గుర్తించడం జరుగుతుంది.
 • ప్రమోటర్లు కో-ఆర్డినేటర్ల పరిధిలో, కో-ఆర్డినేటర్లు ఆర్గనైజర్ల పరిధిలో పనిచేయాలి.
 • ప్రతి సర్వీసు ఏజెంటుకు కొందరు సభ్యులను, ఒక ఏరియాను సంస్థ కేటాయిస్తుంది. ఆ పరిధిలో వారు తమ సేవలు కొనసాగించాలి.
 • ప్రమోటర్లకు కేటాయించిన సభ్యుల కొనుగోలు బి.విపై ప్రమోటర్లకు 5%, కో-ఆర్డినేటర్లకు 3%, ఆర్గనైజరుకు 2% సర్వీసు బి.వి లభిస్తుంది.
 • కో-ఆర్డినేటర్లకు కేటాయించిన సభ్యుల కొనుగోలు బి.విపై కో-ఆర్డినేటర్లకు 8%, ఆర్గనైజరుకు 2% సర్వీసు బి.వి లభిస్తుంది.
 • ఆర్గనైజర్లకు కేటాయించిన సభ్యుల కొనుగోలు బి.విపై ఆర్గనైజర్లకు మాత్రమే 10% సర్వీసు బి.వి లభిస్తుంది.
 • సర్వీసుతోపాటు ఏజెంట్ ల మాదిరిగానే  అమ్మకం/కొనుగోలు, డెలివరీలపై కూడా PBV,  DBV మరియు ABV లు లభిస్తాయి.
ప్యాకేజి ఫండుకు కేటాయించే బి.వి (PFBV):
 • ప్యాకేజి యూనిట్ ఇన్సెంటివ్ చెల్లింపు కోసం సంస్థలో ప్యాకేజిఫండ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది.
 • ప్రతి కొనుగోలు బి.విపై 10% ప్యాకేజిఫండు బి.వి మినహాయించడం జరుగుతుంది.  దీనిని 1బి.వి=1రూపాయి గా పరిగణించడం జరుగుతుంది.
బొనాంజా ఫండుకు కేటాయించే బి.వి (BFBV):
 • డిస్ట్రిబ్యూటర్లకు, ఏజెంట్లకు ప్రత్యేక పరిస్థితులలో మరియు ప్రోత్సాహకంగా పోటీలలో పనిలో ప్రతిభ కనబరచినందుకు గాను సంస్థలో బొనాంజా ఫండు ఏర్పాటు చేయడం జరిగింది.
 • కొనుగోలుపై ప్రకటించిన మేరకు 5% బొనాంజాఫండు బి.వి మినహాయించడం జరుగుతుంది.
డైరెక్ట్ టీమ్ , ఇన్ఫినిటివ్ టీం మ్యాచింగ్ ఫండుకు కేటాయించే బి.వి :
 • సభ్యులకు నిబంధనలమేరకు లభించే డైరెక్ట్ మరియు ఇన్ఫినిటివ్ టీం మ్యాచింగ్ బోనస్ లకు 10బి.విని కేటాయించడం జరుగుతుంది.

కొనుగోలు పద్ధతులు :

 • ఏజెంట్లు తమకవసరమైన వస్తువులను ఇతర ఏజెంట్లు లేదా సర్వీసు ఏజెంట్ల ద్వారా డెలివరీ పొందే పద్దతిని GENERAL SALE METHOD  గా పరిగణించడం జరుగుతుంది.
 • ఏజెంట్లు తమ STB % ను పెంచుకునేందుకు ఎంపిక చేసిన కిట్ లను కొనుగోలు చేయడాన్ని KIT SALE METHOD  గా పరిగణించడం జరుగుతుంది.
 • డిస్ట్రిబ్యూటర్లు ప్యాకేజ్ ఇన్సెంటివ్ ను పొందేందుకు ఎంపిక చేసిన వస్తువులను కొనుగోలు చేయడాన్ని SPECIAL SALE METHOD  గా పరిగణించడం జరుగుతుంది.

సేల్స్ టర్నోవర్ బోనస్ (STB):

 • ప్రతి సభ్యుడు తన డౌన్‌లైన్‌లో మొదటి లెవల్ లో రెండు బిజినెస్ యూనిట్లను లేదా కొత్త సభ్యులను ఏర్పాటు చేసుకోవచ్చు. వీటిని గ్రూపు A మరియు గ్రూపు B గా గుర్తించడం జరుగుతుంది. 
 • గ్రూపు A మరియు గ్రూపు B డౌన్‌లైన్‌లో ఏజెంట్లు/డిస్ట్రిబ్యూటర్లు/సర్వీస్ఏజెంట్లు కొనుగోలు బి.విపై 50% మొత్తాన్ని మీ సేల్స్ టర్నోవర్ బి.వి గా లెక్కిస్తాము. 
 • పర్సనల్ కొనుగోలు బి.విపై లభించే 50% సేల్స్ టర్నోవర్ బి.విని రెండు భాగాలుగా చేసి గ్రూపు A మరియు గ్రూపు B ల  సేల్స్ టర్నోవర్ బి.వికి సమానంగా జమ చేయడం జరుగుతుంది.
 • పై విధంగా ఏర్పడే గ్రూపు A మరియు గ్రూపు B ల  సేల్స్ టర్నోవర్ బి.విని 1:1 లో జతపరచి తక్కువ ఉన్న బి.విపై మీ కిట్ పర్చేజ్ ని బట్టి 4% నుండి 10% వరకు సేల్స్ టర్నోవర్ బోనస్ (STB) చెల్లించడం జరుగుతుంది.
 • మీరు కిట్ కొనుగోలు చేయకుండా ఉన్నపుడు 4% , ఫస్ట్ కిట్ కొనుగోలు చేసి ఉంటే 6%, సెకెండ్ కిట్ కొనుగోలు చేసి ఉంటే 8%,  థర్డ్ కిట్ కొనుగోలు చేసి ఉంటే 10% చొప్పున STB లభిస్తుంది.
 • మీ క్యాడర్ ని బట్టి వారానికి రు.2500/-ల నుండి రు.25,000/-ల వరకూ సేల్స్ టర్నోవర్ బోనస్ (STB) లభిస్తుంది.
క్యాడర్ ప్రమోషన్ పద్ధతి ః
 • క్యాడర్ ర్యాంక్ అనేది క్యుములేటివ్ పర్సనల్ బి.వి, గ్రూపు A మరియు గ్రూపు B ల క్యుములేటివ్ గ్రూపు బిజినెస్ వేల్యూమ్ ఆధారంగా అప్ గ్రేడ్ అవుతుంది.
 • ఆదాయం లభించిన సమయంలో క్యాడర్ ని బట్టి మినిమం వీక్లీ పర్చేజ్ కండీషన్ అమలులో ఉంటుంది.
 • మొదట మీరు సభ్యులుగా ఉంటారు. ఆదాయం పొందాలంటే ఆ వారంలో మినిమం 25బి.వి కొనుగోలు చేయాలి. లేకుంటే హోల్డ్ లో ఉంచబడుతుంది. STB సీలింగ్ రు.2500 ఉంటుంది.
 • మీ క్యుములేటివ్ పర్చేజ్ బి.వి 2500గ్రూపు A మరియు గ్రూపు B ల క్యుములేటివ్ గ్రూపు బిజినెస్ వేల్యూమ్ లు ఒక్కొక్కటి మినిమం 5000 లుగా ఉంటే మీరు డిస్ట్రిబ్యూటర్ గా ప్రమోట్ అవుతారు. ఆదాయం పొందాలంటే ఆ వారంలో మినిమం 50 బి.వి కొనుగోలు చేయాలి.  లేకుంటే హోల్డ్ లోఉంచబడుతుంది. STB సీలింగ్ రు.5000 ఉంటుంది.
 • మీ క్యుములేటివ్ పర్చేజ్ బి.వి 10000 , గ్రూపు A మరియు గ్రూపు B ల క్యుములేటివ్ గ్రూపు బిజినెస్ వేల్యూమ్ లు ఒక్కొక్కటి మినిమం 50000 లుగా ఉంటే మీరు First Star Distributor  గా ప్రమోట్ అవుతారు. ఆదాయం పొందాలంటే ఆ వారంలో మినిమం 100 బి.వి కొనుగోలు చేయాలి.  లేకుంటే హోల్డ్ లోఉంచబడుతుంది. STB సీలింగ్ రు.10000 ఉంటుంది.
 • మీ క్యుములేటివ్ పర్చేజ్ బి.వి 25000 , గ్రూపు A మరియు గ్రూపు B ల క్యుములేటివ్ గ్రూపు బిజినెస్ వేల్యూమ్ లు ఒక్కొక్కటి మినిమం 250000 లుగా ఉంటే మీరు Second Star Distributor  గా ప్రమోట్ అవుతారు. ఆదాయం పొందాలంటే ఆ వారంలో మినిమం 250 బి.వి కొనుగోలు చేయాలి.  లేకుంటే హోల్డ్ లో ఉంచబడుతుంది.  STB సీలింగ్ రు.25000 ఉంటుంది.

డైరెక్ట్ టీం మ్యాచింగ్ బోనస్ (DTMB):

 • ప్రతి సభ్యుడు ఎంతమందినైనా కొత్త సభ్యులను పరిచయం చేయవచ్చు. వీరిని Extremed Left/Extreemed Right పద్దతిలో మీ డౌన్‌లైన్ లో ఏర్పాటు చేసుకోవచ్చు.
 • వీరందరూ మీ ఖాతా డౌన్‌లైన్ లో వివిధ స్థానాలలో ఉంటారు. వీరికి నిబంధనలమేరకు లభించే సేల్స్ టర్నోవర్ బోనస్ పై మీకు 10% మొత్తం డైరెక్ట్ టీం మ్యాచింగ్ బోనస్ (DTMBలభిస్తుంది.
ఇన్ఫినిటివ్ టీం మ్యాచింగ్ బోనస్ ITMB):

 • మొదటి దశలో మీరు పరిచయం చేసిన సభ్యులలో మొదటి ఇద్దరు మినహా మిగతా సభ్యులు, రెండవదశలో వారు పరిచయం చేసిన మొదటి ఇద్దరు సభ్యులు, మూడవ దశలోవారు పరిచయం చేసిన మొదటి ఇద్దరు సభ్యులు...... ఈ క్రమంలో అనంతంగా ఏర్పడే దశలలోని సభ్యులను మీకు సంబంధించిన ఇన్ఫినిటివ్ టీం గా గుర్తించడం జరుగుతుంది.
 • వీరందరూ మీ ఖాతా డౌన్‌లైన్ లో వివిధ స్థానాలలో ఉంటారు. వీరికి నిబంధనలమేరకు లభించే సేల్స్ టర్నోవర్ బోనస్ పై మీకు 10% మొత్తం ఇన్ఫినిటివ్ టీం మ్యాచింగ్ బోనస్ (ITMBలభిస్తుంది.
లాయల్టీ యూనిట్ ఇన్సెంటివ్  (LUI) లభించే విధానం :
 • లాయల్టీ యూనిట్ :  పనిని బట్టి లభించే  డెలివరీ బి.వి  +  సర్వీసు బి.వి + యాడింగ్ బి.వి కలిపి మీ టోటల్ లాయల్టీ బి.విగా గుర్తించడం జరుగుతుంది.
 • లాయల్టీ యూనిట్ ప్రమోషన్ పద్ధతిలో సభ్యులందరి బ్యాలన్సు లాయల్టీ బి.విలని కలిపి లెక్కించి ప్రతి 10000 బి.వికి ఒక లాయల్టీ యూనిట్ చొప్పున కేటాయించి సభ్యుల బ్యాలన్సు లాయల్టీ బి.వి ఆధారంగా వరుస క్రమంలో లాయల్టీ యూనిట్లని కేటాయించడం జరుగుతుంది.
 • లాయల్టీ ప్రమోషన్ ప్లాన్ పద్ధతిలో బిజినెస్ యూనిట్ కేటాయింపబడినపుడు మీ ఖాతా  లాయల్టీ బి.వి నుండి ఒక్కొక్క బిజినెస్ యూనిట్ కు 10000 చొప్పున లాయల్టీ బి.విని మినహాయించడం జరుగుతుంది. మిగిలినదానిని బ్యాలన్సు లాయల్టీ బి.విగా గుర్తించడం జరుగుతుంది.
 • ప్రతి లాయల్టీ యూనిట్ కు 25000 మెచూరిటి విలువ ఉంటుంది. మంత్లీ సీలింగ్ 1000 ఉంటుంది.
 • సంస్థ అమ్మకాల బి.విపై 25% మొత్తంతో లాయల్టీ ఫండ్ ఏర్పడుతుంది. 
 • లాయల్టీ ఫండ్ ని నెలకోసారి అన్ని లాయల్టీ యూనిట్లకు సీలింగ్ మేరకు సమానంగ పంచడం జరుగుతుంది.
ప్యాకేజి యూనిట్ ఇన్సెంటివ్ (PUI) :

 • సభ్యులు లేదా సర్వీసు ఏజెంట్లు ఇతర సభ్యులకు డెలివరీ చేయడానికి ముందుగా సంస్థ నుండి వస్తువులను బదిలీ పొందాల్సి ఉంటుంది. ఈ సమయంలో నిబంధనలమేరకు ప్యాకేజి యూనిట్లు లభిస్థాయి.
 • ప్రొడక్టు బదిలీని బట్టి ప్రకటించిన మేరకు ప్యాకేజి యూనిట్/యూనిట్లు కేటాయించడం జరుగుతుంది.  
 • ప్రతి ప్యాకేజి యూనిట్ కు మెచ్యూరిటీ విలువని, వీక్లీ సీలింగ్ ని కేటాయించడం జరుగుతుంది.
 • సభ్యులు లేదా సర్వీసు ఏజెంటులు కిట్, స్పెషల్ ప్రొడక్టులను నేరుగా సంస్థ నుండి కొనుగోలు చేసే సందర్భాలలో కూడా ప్యాకేజి యూనిట్లు పొందే అవకాశం ఉంది.
 • ప్రతి పే అవుట్ లో బ్యాలన్సు ప్యాకేజి ఫండుని అన్ని ప్యాకేజి యూనిట్లకు పంపిణీ చేయడం జరుగుతుంది. ప్యాకేజి ఫండు మిగిలితే తదుపరి పే అవుట్ కు బదిలీ చేయడం జరుగుతుంది.
 • మెచూరిటీ వేల్యూ మేరకు చెల్లింపు పూర్తయిన యూనిట్ రద్దవుతుంది.
 • ప్యాకేజి ఫండు :  ప్రతి కొనుగోలు బి.వి పై 10% చొప్పున ఒక బి.వి = ఒక రూపాయి చొప్పున ప్యాకేజి ఫండు ఏర్పడుతుంది.

బొనాంజా బహుమతులు (BONANZA) :

 • సంస్థలో సభ్యులకు / ఏజెంట్లకు వారి పనిని బట్టి ప్రోత్సాహకంగా బహుమతులు ఇచ్చేందుకు బొనాంజా ఫండుని ఏర్పాటు చేయడం జరిగింది.
 • బొనాంజా ఫండు :  ప్రతి బి.పి.పి లూజ్ కొనుగోలు బి.వి పై 5% చొప్పున (ఒక బి.వి = ఒక రూపాయి) ప్యాకేజి ఫండు ఏర్పడుతుంది.
 • బొనాంజా వివరాలను, విజేతలను ఎప్పటికపుడు వెబ్సైట్లో ప్రకటించడం జరుగుతుంది.
 • విజేతలకు బొనాంజాను బహుమతుల లేదా యాడింగ్ బి.వి రూపంలో అందజేయడం జరుగుతుంది.
 • విజేతలకు చెల్లించిన బొనాంజాను బొనాంజా ఫండు నుండి (ఒక బి.వి = ఒక రూపాయి) చొప్పున ఎప్పటికపుడు మినహాయించడం జరుగుతుంది.
ఆదాయం చెల్లింపు విధానం :

 • సంస్థలో సభ్యులకు / ఏజెంట్లకు లభించే అన్ని రకాల ఇన్సెంటివ్ లను కలిపి వారి ప్రధాన ఖాతాకు జమచేసి వారానికొకసారి పేఅవుట్ గా చెల్లించడం జరుగుతుంది.
 • నిబంధనలమేరకు ఆదాయం మరియు ఇతర ప్రభుత్వ ట్యాక్సులు, 5% అడ్మిన్ ఛార్జీలు, కోరిన సమాచారం పొందినపుడు ఎస్.ఎం.ఎస్ ఛార్జీలు మినహాయించడం జరుగుతుంది.


Copyright © 2018. All Rights Reserved.